ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 వ తేదీన గ్రామ/వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు,ఈ.ఆర్.ఓ లు, ఎ.ఈ.ఆర్.ఓ. లతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా గ్రామ/వార్డు సభల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ
ఎస్ఐఆర్ లో భాగంగా ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గ్రామ/వార్డు సభలు నిర్వహించి ముసాయిదా ఓటర్ల జాబితా, ఎ.ఎస్.డి.(ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితా బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్ల సమక్షంలో చదివి వినిపించాలని తెలిపారు. గ్రామ/వార్డు సభల నిర్వహణ సమయంలో బూత్ స్థాయి అధికారులు ఫారం-6, 7, 8 అందుబాటులో ఉంచుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నోట్ చేసుకోవాలని తెలిపారు. అనామోలీస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు సంబంధించిన వివరాలు బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని, పెండింగ్ లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నోటీసులు అందించాలని తెలిపారు. అవసరం ఉన్నచోట అదనపు ఎ.ఈ.ఆర్.ఓ.ల సంబంధిత ప్రతిపాదనలు రేపటి లోగా పంపించాలని తెలిపారు.
అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ
జిల్లాలో అనామోలీస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు సంబంధించిన నోటీసుల జనరేషన్ దాదాపు పూర్తి స్థాయిలో జరగడం అయిందని,నోటీసులను సంబంధిత ఓటర్లకు 3 రోజులలోగా అందించాలని తెలిపారు. కార్యాచరణ ప్రకారం గ్రామ/వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని, అదనపు ఎ.ఈ.ఆర్.ఓ ల సంబంధిత ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కె అనిల్ కుమార్, మహబూబాబాద్, తొర్రూరు రాజస్వ మండలఅధికారులు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్, అన్ని మండలాల తహసిల్దార్లు, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.