వర్ధన్నపేట(రైట్స్ మీడియా): వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నీలగిరి స్వామి తండాలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి 6 చొప్పున పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను పంపిణీ చేశారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
వర్ధన్నపేట మున్సిపాలిటీలో వనమహోత్సవం
⏩ఐదో వార్డులో ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ.
News URL: https://rightsmedia.in/news/vanamahotsavam-in-wardhannapet-municipality
అనంతరం చైర్మన్ సారంగపాణి మాట్లాడుతూ..
పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లు పెరగడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటి గ్రీన్ తండాగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి - రాజేందర్, మున్సిపల్ సానిటేషన్ ఇన్ స్పెక్టర్ కరుణాకర్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.