నిజామాబాద్(రైట్స్ మీడియా): అక్రమ మద్యం అమ్మకాల నిరోధంపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నిజామాబాద్, అరుణ్ కుమార్ ఆదేశానుసారం జిల్లాలో కొన్ని రోజులగా సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో భాగంగా గత రాత్రి న్యాల్ కాల్ రోడ్, ముబారక్ నగర్ నందు కంకణాల గంగరత్నం మరియు మూడ భాస్కర్ ఇంట్లో దాడులు చేయగా వారి వద్ద 110 విదేశీ మద్యం, డిఫెన్స్ మద్యం బాటిళ్లు లభించినట్టు తెలిపారు. అయితే విదేశాల నుండి వచ్చే వారి ద్వారా మద్యం కొనుగోలు చేయడం ఇతర మార్గాల ద్వారా డిఫెన్స్ మద్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ అవసరం ఉన్న వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు ఎండి.నజీర్ హుస్సేన్ ఎక్సైజ్ బి.గజేందర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ ఎస్సై రవి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ హెచ్ఓ ఎం.సరిత తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
విదేశీ మద్యం, డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్... 110 విదేశీ మద్యం, డిఫెన్స్ బాటిళ్లు స్వాధీనం...
News URL: https://rightsmedia.in/news/two-arrested-for-selling-foreign-and-defence-quota-liquor-110-bottles-seized