దళిత మేధాశక్తి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు
నల్లబెల్లి కారుణ్య జ్యోతి పాఠశాల లో
దళిత మేధా శక్తి ఆధ్వర్యంలో దళిత చైతన్యం & రాజ్యాధికారం సాధన” అనే అంశంపై నిర్వహించిన శిక్షణ తరగతులు నిర్వహించగా దళిత మేధాశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు, న్యాయవాది బొట్ల పవన్ పాల్గొని మాట్లాడుతూ.. దళిత మేధాశక్తి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని విలువైన అభిప్రాయాలను, ఆలోచనలను మరియు సూచనలను పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ దళిత మేధా శక్తి తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
ప్రతి ఒక్కరూ మాట్లాడిన తీరు చూసిన తర్వాత మాకు కొండంత బలం వచ్చిన అనుభూతి కలిగింది. మనలో చైతన్యం, ఐక్యత, నాయకత్వం పెరిగితేనే మన లక్ష్యాల వైపు మరింత బలంగా ముందుకు సాగగలం.
మీ అందరూ ఇదే విధమైన సహకారం, ఆదరణ, ఐక్యత ఎల్లప్పుడూ అందిస్తే మనం కలిసి మరింత ముందుకు సాగుతూ, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేయగలుగుతాం అని అన్నారు