రాజన్న సిరిసిల్ల(రైట్స్ మీడియా): జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య – లక్ష్మి దంపతులు శుక్రవారం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందారు. దేవయ్య, లక్ష్మీ దంపతులు గ్రామ శివారున గల కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దేవయ్య, లక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్తో దంపతులు మృతి
News URL: https://rightsmedia.in/news/tragedy-in-rajanna-sircilla-district-couple-dies-of-electric-shock