ఐక్యతతో సాధించలేనిది ఏదీ లేదు: ముదిరాజ్ నాయకులు
ఐక్యతతో కలిసి ఉంటే ముదిరాజ్ జాతి సాధించలేనిది ఏదీ ఉండదని ముదిరాజ్ నాయకులు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామంలో మత్స్యపారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గ అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ముదిరాజ్ నాయకులు తాళ్ల రవీందర్ ముదిరాజ్ అధ్యక్షత వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పొన్నం మొగిలి ముదిరాజ్, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నారై, రాష్ట్ర ముదిరాజ్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లంపల్లి మత్స్య సహకార సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. ముదిరాజుల హక్కుల కోసం, సంఘ సమస్యల పరిష్కారం కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని, అప్పుడే సమాజంలో మన జాతికి గుర్తింపు వస్తుందని పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు:
ప్రభుత్వం మే 31 వరకు ప్రమాద బీమా పథకాన్ని నిలిపివేయగా, ఈ విషయాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ దృష్టికి తీసుకెళ్లామని, వారు స్పందించి ప్రమాదంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించేందుకు సహకరించారని, ఈ సందర్భంగా వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కీర్తిశేషులు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
నూతన కార్యవర్గం:
అధ్యక్షులు గా సోడా సమ్మయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా పాండవుల శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా ఈర్ల కొమ్మాలు ముదిరాజ్,
డైరెక్టర్లుగా సోడా వేణు ముదిరాజ్, ఈర్ల రమేష్ ముదిరాజ్, భూమ నర్సయ్య ముదిరాజ్, ఈర్ల రాజు ముదిరాజ్, లక్క మహేందర్ ముదిరాజ్, మొద్దు వీరన్న ముదిరాజ్ లు ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు ఓరంగంటి తిరుపతి ముదిరాజ్, మాజీ మత్స్య సహకార సంఘ అధ్యక్షులు ఈర్ల నరేష్ ముదిరాజ్, కుల పెద్దలు పాండవుల వెంకటేశ్వర్లు, పాండవుల రామకృష్ణ ముదిరాజ్, ఈర్ల సారయ్య ముదిరాజ్, సోడా శ్రీధర్ ముదిరాజ్, తెప్ప సుమన్ ముదిరాజ్, భూమ రవి ముదిరాజ్, ఏళ్ల స్వామి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.