22ఏ భూముల సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి అధికారులతో సమీక్షించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారని తెలిపారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నందున 22ఏ పరిధిలో ఉన్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుండగా ప్రతిపక్షాలు ధర్నాలు, ఆందోళనల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం విడ్డూరమన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ధరణి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి భూదందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 22ఏ బాధితుల పక్షాన ప్రభుత్వం నిలుస్తుందని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
22ఏపై ప్రభుత్వమే చిత్తశుద్ధితో వుంది: కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
News URL: https://rightsmedia.in/news/the-government-itself-is-sincere-regarding-the-22a-issue-komatireddy-narendar-reddy