కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. రేవంత్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లి రైతుల కోసం తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మరణం రైతాంగానికి తీరని లోటని అన్నారు.
సమస్యపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో సారంపల్లికి సాటి లేరు కౌలు రైతుల సమస్య, పంటలు గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో పోరాడారు. భూమి సారం నుంచి పంట తీసేవరకు సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్ సైక్లోపీడియా సారంపల్లి. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యలను మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సారంపల్లి మల్లారెడ్డి అంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో అభిమానం. భూమిలేని నిరుపేదలకు కనీస కూలీ ఉండాలని కమ్యూనిస్టులు కొట్లాడారు. కనీస వేతన చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ . దున్నేవాడికి భూమికోసం కమ్యూనిస్టులు పోరాడారు . అసైన్డ్ భూములను 24 లక్షల 56 వేల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది . 10 లక్షల ఎకరాలు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయి . ఇది కమ్యూస్టుల పోరాటానికి .. కాంగ్రెస్ పరిష్కారం . ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ . ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ . కమ్యూనిస్టులు లేవనెత్తిన ప్రతీ సమస్యను కాంగ్రెస్ పరిష్కరించింది . ఎన్నికల్లో కలిసినా కలవకపోయినా.. కమ్యూనిస్టుల పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది . మనమంతా కలసి దేశంలో మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది .
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు కొత్త కొత్త విధానాలను అవలంబిస్తున్నారు . ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసుకున్నారు . తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారు . బెంగాల్ లో చేసినట్లే తెలంగాణలో చేస్తామని బీజేపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారు . గత ఎన్నికల్లో బూత్ ల వారీగా బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీలను పెట్టి సర్వేలు చేయించి క్రమపద్ధతిలో ఓట్లు తొలగిస్తున్నారు . ఎన్నికల కమిషన్ ను కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోంది . SIR పై ప్రధాన ప్రతిపక్షం ఏ ఒక్క మాట మాట్లాడటంలేదు . దీని వెనక వారికున్న అవగాహనను కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలి . ఎన్నికలు వేరు.. పేద ప్రజల ప్రాథమిక హక్కులు వేరు . ఇన్నాళ్లుగా పేదల హక్కుల కోసం కమ్యూనిస్టులు కొట్లాడుతున్నారు . ఎర్రజెండా కనిపిస్తే పేదవాడికి నొక భరోసా . దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్రమోదీ . మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు . పేద ప్రజల ఓటు హక్కును కమ్యూనిస్టులు కాపాడాలి . కేబినెట్ సహచరులతో చర్చించి.. సారంపల్లి మల్లారెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తామని అన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
తెలంగాణ
కమ్యూనిస్టులు లేవనెత్తిన ప్రతీ సమస్యను కాంగ్రెస్ పరిష్కరించింది
సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభతో సీఎం రేవంత్ రెడ్డి.
News URL: https://rightsmedia.in/news/the-congress-resolved-every-issue-raised-by-the-communists