కాకతీయ యూనివర్సిటీ(రైట్స్ మీడియా): అతిథి గృహం నందు మంగళవారం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మాజీ కె యూ అధ్యక్షులు కుమ్మరి శ్రీనాథ్ మాదిగ అధ్యక్షతన MRPS,MSF ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా ఇంచార్జి ముక్కెర ముఖేష్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. గత 30 సం. నుండి SC వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి సాధించిన విషయం అందరికీ తెలిసినదే. SC వర్గీకరణ ద్వారా సాధించిన ఫలితాలను మాదిగ విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండాలని పేర్కొన్నారు కుల మత వర్గ లింగ విబేధాలు లేకుండా మహనీయుల కలలు కన్న నూతన సమాజాన్ని నిర్మించుకోవడం లో మాదిగ విద్యార్థులు ముందు వరుసలో నిలబడాలి అని కొనియాడారు. ప్రస్తుత సమాజములో నెలకొంటున్న సమస్యలు, విద్యా రంగా సమస్యలు మహిళల పట్ల జరుగుతున్న దాడులు ఇతర సమస్యల పట్ల విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు .
హైదరాబాద్ కేంద్రముగా ఉస్మానియా యూనివర్సిటీ లో జరగబోయే మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు కి వేలాది విద్యార్థులు తరలి విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో MEF నాయకులు బొడ్డు దయాకర్ మాదిగ, మంద చిన్న రాజు మాదిగ, పుల్లా శ్రీనివాస్, సంకినేని వెంకట్ MRPS నాయకులు ఏపూరి వెంకటేశ్వర్లు, తడుగుల విజయ్ మాదిగ మాదిగ, వేల్పుల సూరన్న బండారి సురేందర్ మాదిగ, సుకుమార్ మాదిగ, MSF నాయకులు మంద భాస్కర్, అభిలాష్, సతీష్, పవన్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.