కొండ సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని కాంగ్రెస్ నేత -కొండా మురళి అన్నారు. బుధవారం ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో భేటీ అయ్యారు. తరువాత ఆయన మాట్లాడుతూ.. సుస్మితను ప్రశ్నించే హక్కు మాకు లేదు. కమిటీకి మేం చెప్పాల్సింది చెప్పాం. నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని అన్నారు. ఓ బిల్లు విషయంలో భట్టిని కలిశా. గాంధీ కుటుంబంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా. నా బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కుందని అయన అన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
తెలంగాణ
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం: కొండా మురళి
News URL: https://rightsmedia.in/news/sushmita-s-comments-are-her-personal-views-konda-murali