కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారెంటీలను, 420 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని నిరసిస్తూ, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు బిఆర్ఎస్ హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బండి రజనీ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసిల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో బిఆర్ఎస్ నాయకులు గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రాలు సమర్పించారు.
తహసిల్దార్, ఎంపీడీఓ ఆఫీసుల్లో బిఆర్ఎస్ వినతిపత్రాల సమర్పణ
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మరోవైపు, ప్రజా సమస్యలపై నిలదీసేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అకారణంగా శాసనసభ గేటు వద్దే పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు పాశవికంగా ప్రవర్తించి, అవమానించారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 66వ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, 1వ డివిజన్ అధ్యక్షుడు నరేడ్ల శ్రీధర్, మాజీ ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్, మల్లారెడ్డిపల్లి పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, హసన్పర్తి పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాడి మల్లారెడ్డి, మాజీ సర్పంచులు కుమారస్వామి, రవీందర్, మాజీ జెడ్పిటిసి కొత్తకొండ సుభాష్ గౌడ్, నాగరాజ్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.