• ప్రతీ ఒక్క ఉద్యోగి ఆన్లైన్లో ముఖ చిత్రం హాజరులో నమోదు చెయ్యాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
• జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్.
మహబూబాబాద్(రైట్స్ మీడియా): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రతీ ఒక్కరూ ఆన్లైన్ ముఖ చిత్రం హాజరులో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.
సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో, మహబూబాబాద్ ఆర్డీవో కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.
జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ రెవిన్యూ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల (ఇంచార్జ్) పురుషోత్తం లతో కలిసి,వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సమర్పించిన అర్జీలను స్వీకరించారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారం పై వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను స్వీకరిస్తూ వారు చెప్పిన వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ...
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
గురుకుల హాస్టల్స్, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు కావలసిన ప్రతిపాదనలను సంక్షేమ శాఖల స్పెషల్ అధికారులు సత్వరమే అందజేయాలన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు కోసం పట్టభద్రులైన ఓటర్లు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (93) అర్జీలను ప్రజలు అందజేయగా మహబూబాబాద్, ఆర్డీవో కార్యాలయాల్లో (03), ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలు (123) వచ్చాయి.
ఈ ప్రజావాణిలో కార్యక్రమంలో డిఆర్ఓ నాగలక్ష్మి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డివిఎచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రవి రాథోడ్, సిపిఓ శ్రీనివాసరావు, డిహెచ్ఎస్ఓ జీ. మరియన్న, అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.