హుజురాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సారెస్పీ కెనాల్లో నీటి ప్రవాహం లేకపోవడంతో నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి కెనాల్లో నింపడంతో పాటు, ఇసుక బస్తాలను అడ్డుగా పేర్చి నీటిని నిల్వ చేస్తున్నారు. సుమారు 150కు పైగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
కెనాల్లో నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని తెలిపారు. నిమజ్జనం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుందని, భక్తుల భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు: హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని
⏩కెనాల్లో నీరు లేకపోవడంతో ట్యాంకర్లు, ఇసుక బస్తాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.
News URL: https://rightsmedia.in/news/special-arrangements-for-vinayaka-immersion-huzurabad-municipal-chairperson-rontala-suhasini