అమరావతి, అక్టోబర్ 31(రైట్స్ మీడియా): అర్నబ్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తమవంతు సాయం అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల 1 లక్ష రూపాయల విరాళాన్ని అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిసి ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం చెక్కును అందజేశారు. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా విరాళం అందించిన ఎస్బీఐ మేనేజ్మెంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎస్బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం సుశీల్ కుమార్, అమరావతి సర్కిల్ జీఎం కుందన్ జ్యోతి, అమరావతి సర్కిల్ ఏజీఎం షేక్ షమీన్ భాను ఉన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
రాష్ట్రాలు
ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్బీఐ రూ.5 కోట్ల విరాళం
News URL: https://rightsmedia.in/news/sbi-donates-rs-5-crore-to-chief-minister-s-relief-fund