RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
రంగపురంలో వనమహోత్సవం ప్రారంభించిన సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు
రంగాపురం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు మొక్కను నాటి, గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు శ్రీకారం చుట్టారు.
News URL: https://rightsmedia.in/news/sarpanch-oruganti-madhuri-raju-inaugurated-the-vanamahotsavam-in-rangapuram
ప్రత్యేకంగా అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా గ్రామ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది. గ్రామ రహదారులు పచ్చదనంతో కళకళలాడేలా, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాదు.. అవి పెద్దవయ్యే వరకు సంరక్షించడమే అసలైన బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కోడెపాక పోశాలు, పంచాయతీ కార్యదర్శి మేడిపల్లి రామారావు, ఫీల్డ్ అసిస్టెంట్ తోటకూరి సుమన్, గ్రామ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.