బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు తుళ్ళ కుమారస్వామి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తుళ్ళ కుమారస్వామి మాట్లాడుతూ అసెంబ్లీని ముట్టడించిన, రైతుల పక్షాన నిలబడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తుందన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నారనే కక్షతో బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎమ్మెల్యేలను బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు.దాదాపు గంట పాటు రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.పోలీసులు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, మాజీ మార్కెట్ చైర్మన్లు గుజ్జ గోపాల్ రావు, గుజ్జ సంపత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గుజ్జ వీరన్న, తుమ్మల అరుణ శ్రీధర్, తిరుపతి సురేష్, సింగర బోయిన రమా రాజశేఖర్, మాజీ కౌన్సిలర్లు తోటకూర రాజమణి,నాయకులు పూజారి రఘు,దుగ్యాల జ్యోతి మాధవరావు, శ్రీను, దేవేందర్ రావు, అంగోత్ బిక్షపతి, కొండేటి శ్రీనివాస్, కొండేటి సంపత్, సుంకర సాంబయ్య, అంబటి ఎల్ల స్వామి, దేవేంద్ర యాదవ్, సుధాకర్, ఐత ఎల్లయ్య, ఎండి అజీమ్, శ్రీధర్, బాల్యరమేష్, బోడ్డుపల్లి శ్రీకాంత్, ఏకాంబచారి, భూక్యా ఘోర, సుమన్, సురేందర్, వసంత నాయక్, వీరన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ వర్ధన్నపేటలో రాస్తారోకో, ధర్నా
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బేషరతుగా విడుదల చేయాలి
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుళ్ళ కుమారస్వామి
News URL: https://rightsmedia.in/news/road-blockade-and-protest-in-wardhannapet-against-the-arrest-of-brs-mlas