భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు వర్ధన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 సంవత్సరాల వయస్సులోనే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ టెలికాం, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వివరించారు. దేశంలో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేశారని కొనియాడారు. నవోదయ విద్యాలయాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఘనత ఆయనదేనని అన్నారు.దేశంలో శాంతి, మత సామరస్యం, సమగ్రతను కాపాడుకోవాలని, రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేందర్ , పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, వర్ధన్నపేట మండల అధ్యక్షులు పోశాల వెంకన్న, వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నరకుడు వెంకటయ్య, ఐనవోలు దేవస్థాన చైర్మన్ ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు పాపారావు, వాణి కుమారస్వామి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కిమా నాయక్, సర్పంచ్లు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
News URL: https://rightsmedia.in/news/rajiv-gandhi-jayanti-celebrations-in-full-swing