భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా నింగిలోకి పంపిన అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 'ఈఓఎస్-05' ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో జియో ఆర్బిట్ నుంచి మన దేశానికి సంబంధించి తొలిసారిగా ఒక ఇమేజింగ్ శాటిలైట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రయోగంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ.. ఇది దేశానికే ఎంతో గర్వకారణమైన క్షణమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మన దేశ అంతరిక్ష రంగం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతికి, నూతన ఆవిష్కరణలకు ఈ ప్రయోగం నిదర్శనమని ప్రధాని కొనియాడారు. ఇస్రోతో పాటు మన దేశంలోని ప్రైవేట్ పరిశ్రమలు కలిసి పనిచేస్తుండటం వల్ల మన అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుతోందని తెలిపారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జాతీయం
ఇస్రోకు ప్రధానమంత్రి మోదీ అభినందనలు
జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా నింగిలోకి పంపిన అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 'ఈఓఎస్-05' ప్రయోగం విజయవంతమైంది. ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
News URL: https://rightsmedia.in/news/prime-minister-modi-congratulates-isro