రంగపురం గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించిన ప్రాథమిక వైద్యశాల అధికారులు
రంగాపురం గ్రామంలో సోమవారం హెల్త్ క్యాంప్‌ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు పాల్గొని, గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రంగాపురం గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి" అని సూచించారు.ఈ హెల్త్ క్యాంప్‌లో గ్రామ వార్డు మెంబర్లు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..
రంగాపురం గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి" అని సూచించారు. ఈ హెల్త్ క్యాంప్‌లో గ్రామ వార్డు మెంబర్లు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.