ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేత
నల్లబెల్లి మండలంలోని వివిధ గ్రామాల పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి, పాఠశాలల ప్రగతికి ఎంతో కృషి చేస్తున్న 13 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయునులను అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంఈఓ అనురాధ మాట్లాడుతూ..
ఎంపికైన ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూ విద్యా రంగ అభివృద్ధికి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధిని నేర్పి, వారిని ప్రయోజకులిగా తీర్చిదిద్ది వారిని ఉన్నత స్థానంలో ఉంచాలని ఎంపికైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కు సూచనలు ఇచ్చారు. రానున్న రోజులలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలలో విద్యార్థులను చేర్పించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని వారిని కోరడం జరిగింది.
ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయునులు:
• ఎ. రామ్ మనోహర్ – జడ్.పి.హెచ్.ఎస్- రంగాపురం.
• డి. శ్రీధర్ బాబు – జడ్.పి.హెచ్.ఎస్ - నల్లబెల్లి.
• పి. కైలాసం – ఎం పీ యుపి ఎస్ - కొండాపూర్.
• సి. సుచరిత – జెడ్ పి ఎస్ ఎస్ -నందిగామ.
• భూక్య రామరాజు – ఎం పీ పీ ఎస్ - మేడపల్లి.
• ఎ. శేఖర్ – ఎం పీ యు పిఎస్ - బొల్లొనిపల్లి.
• నూతి రమేష్ – ఎంపీ యు పిఎస్ - గుండ్లపహాడ్.
• పి. భద్రినాథం – ఎం పీ పీ ఎస్ -నల్లబెల్లి.
• భూక్య గోపిచంద్ – ఎం పీ పీ ఎస్- ముదుచెక్కలపల్లి.
• ఎస్. మురళీధర్ – ఎం పీ పీ ఎస్ - రుద్రగూడెం.
• జి. ఉష – ఎం పీ పీ ఎస్ -నందిగామ.
• ఆర్. జమున రాణి – కే జీ బీ వి - నల్లబెల్లి.
• కెలోత్ కవిత – ఏ హెచ్ ఎస్ -ముడు చెక్కలపల్లి.
అవార్డులు అందజేత
ఎంపికైన ఉపాధ్యాయులందరికీ మండల విద్యాశాఖ అధికారీ ఆధ్వర్యo లో మండల కేంద్రంలోని రైతు వేదికలో అవార్డు లు అందజేసి గ్రహీతలను ఘనంగా సన్మానించారు.
భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యారంగానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగేల్లి జ్యోతి -ప్రకాష్,
ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్ .రవీందర్, మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘల బాధ్యులు, ఉపాధ్యాయూని, ఉపాధ్యాయులు,
ఎమ్మార్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.