ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 27 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా పరిష్కరించి పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు స్పందిస్తూ, వినతులను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్వో వసంత కుమారి, ఆర్డిఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
ప్రజావాణి దరఖాస్థులను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలి
News URL: https://rightsmedia.in/news/praja-vani-applications-must-be-addressed-on-a-priority-basis