కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ తో కలిసి ప్రధాన పరిపాలనా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతానికి, రాష్ట్ర గీతానికి వందనం సమర్పించారు. అనంతరం, విద్యార్థుల మెరుగైన సంక్షేమం కోసం క్యాంపస్లో విద్యా వాతావరణాన్ని నిర్మించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆచార్య కె. పద్మావతి, డా. ఎన్.వి. శ్రీరంగ ప్రసాద్, డా. ఎస్. రమాకాంత్, సీఓఈ డా. డి. సురేష్ కుమార్, విద్యా విభాగాల అధిపతులు, ఆచార్య అబ్రారుల్ బాఖి,పరిపాలనా అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
శాతవాహన విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
News URL: https://rightsmedia.in/news/praja-palana-day-celebrated-grandly-at-satavahana-university