మహబూబాబాద్, అక్టోబర్ 30(రైట్స్ మీడియా): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, మహబూబాబాద్ నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ప్రగతి గ్రామీణ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో రూపొందించిన “నషా ముక్త్ యువ వికసిత్ భారత్” అవగాహన కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
నషా ముక్త్ యువ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమ పోస్టర్లు విడుదల
News URL: https://rightsmedia.in/news/posters-for-the-drug-free-youth-developed-india-awareness-program-released
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ మాట్లాడుతూ,
యువత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, సామాజిక దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అవగాహన కార్యక్రమాల ద్వారా మహబూబాబాద్ జిల్లాను నషా ముక్త్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో రాజకుమార్, సి.హెచ్.ఓ జ్ఞాన సుందరి, భాగ్యలక్ష్మి, సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.