మత్స్యకార సంఘం నేత మండాది శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులు, కుమారుడు రేవంత్ సాయిపై వన్ టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసారు. ఇంటి సోదాల్లో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. 32 మంది బాధితుల నుంచి రూ.51.79 లక్షల చిట్టీల మోసం జరిగినట్లు గుర్తించారు. నిందితులు మహాలక్ష్మి, కుమారుడు రేవంత్ సాయి అరెస్ట్..14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు కోసం గాలింపు జరుపుతున్నారు. 32 మంది చిరు మత్స్యకార కుటుంబాల సొమ్ము దోపిడీ జరిగినట్లు సమాచారం. బయటికి రాని బాధిత కుటుంబాలు ఇంకా అనేకం. 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం పేరుతో కోట్ల ఆస్తులు కూడపెట్టారని బాధితుల ఆరోపణ. జులై 31న ఫిర్యాదు చేసినా పోలీసులు ఆలస్యంగా స్పందించారు. బాధితులకే రూ.38.60 లక్షలకు ఐపీ నోటీసులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోనించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
గుడివాడలో చిట్టీల ముసుగులో టోకరాపై పోలీసుల చర్యలు
News URL: https://rightsmedia.in/news/police-take-action-against-a-scam-involving-chit-funds-in-gudivada