మలక్ పేట్ లో పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి చెందాడు. మూసారాంబాగ్ శాలివాహన నగర్ లో ఘటన జరిగింది. కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. అంబర్పేట్ హెడ్ క్వా ర్టర్స్ లో కానిస్టేబుల్ రైటర్ విధులు నిర్వహిస్తు్న్నాడు. అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసినట్లు సమాచారం. తాను ఉరేసుకుంటున్నట్లు యువతికి చెప్పినట్లు సమాచారం. వెంటనే యువతి చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది. చైతన్యపురి పోలీసుల సమాచారంతో మలక్ పే ట్ పోలీసులకు విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
మలక్ పేట్ లో పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
News URL: https://rightsmedia.in/news/police-constable-dies-under-suspicious-circumstances-in-malakpet