స్మార్ట్ రేషన్ కార్డ్ పై ప్రధానమంత్రి మోడీ ఫోటో ఉండాలి: బిజెపి నాయకులు
ప్రధానమంత్రి జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) కింద ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) మరియు అంత్యోదయ అన్న యోజన (AAY) పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో భాగంగా, ప్రతి రేషన్ షాప్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో ఏర్పాటు చేయడంతో పాటు, స్మార్ట్ రేషన్ కార్డులపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో ముద్రించాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు నర్సంపేట RDO ఉమా రాణి ని కలిసి మెమోరండం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా పేద, నిరుపేద కుటుంబాలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తూ ఆహార భద్రత కల్పిస్తోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకం గురించి లబ్ధిదారులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ప్రతి రేషన్ షాప్ వద్ద ప్రధాని మోదీ ఫోటో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రేషన్ లబ్ధిదారులకు అందించే స్మార్ట్ రేషన్ కార్డులపై కూడా ప్రధాని మోదీ ఫోటోను తప్పనిసరిగా ముద్రించాలని డిమాండ్ చేశారు.
సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుందని దీనిలో కేంద్రప్రభుత్వం 83.40 శాతం (5 కేజీల బియ్యం) రాష్ట్ర ప్రభుత్వం 16.60 శాతం (1kg బియ్యం) ఇస్తున్నారని, పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం అందించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజేయడంతో పాటు, సంక్షేమ పథకాలపై అవగాహన పెంచేందుకు ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.
తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ గారి ఫోటో ఏర్పాటు చేయడంతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులపై కూడా ఫోటో ముద్రించేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, నర్సంపేట రూరల్ అధ్యక్షులు తనుగులు అంబేద్కర్, నల్లబెల్లి మండల అధ్యక్షులు తడక వినయ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు కోమల్ రెడ్డి, జిల్లా ST మోర్చా జిల్లా అధ్యక్షులు బానోతు రమేష్ నాయక్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శీలం సత్యనారాయణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ దుంక దువ్వ రంజిత్ Bjym జిల్లా ప్రధానకార్యదర్శి అచ్చ దయాకర్, Bjym జిల్లా ఉపాధ్యక్షులు విగ్నేష్, Bjym జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నూనె రంజిత్, పట్టణ మరియు వివిధ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.