మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలి అని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య తెలిపారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండల పరిధిలోని బండౌతపురం గ్రామంలో వర్ధన్నపేట ఎంపీడీవో వెంకటరమణతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ నరకుడు వెంకటయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కను నాటి సంరక్షించాలి. అప్పుడే రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని అందించగలం. ప్రతి ఇంటి ఆవరణంలో మొక్కలు నాటి సంరక్షించాలి. రైతులు తమ పొలం గట్లపై కూడా మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. ఎంపీడీవో వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు .
నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మొక్కకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తిని దశరథం, ఉప సర్పంచ్ మంద సుకన్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సీనపల్లి బాబు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
News URL: https://rightsmedia.in/news/planting-trees-is-everyone-s-social-responsibility