హనుమకొండ(రైట్స్ మీడియా): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అందించిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో, హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాలు, జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
అర్జీలను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
⏩ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్
⏩ హనుమకొండ జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 225 అర్జీలు
News URL: https://rightsmedia.in/news/petitions-should-be-resolved-quickly-district-collector-chahat-bajpai
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీని త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 98అర్జీలను ప్రజలు అందజేయగా హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాల్లో 30 అర్జీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 97 అర్జీలు ( మొత్తం 225) వచ్చాయి.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, స్థానిక సంస్థల జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డిఆర్డివో మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.