స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన పిఏ సిఎస్ చైర్మన్ రఘుపతిరావు
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. లేంకాలపెల్లి, నల్లబెల్లి, గోవిందాపురం, కన్నరావుపేట, బుచ్చిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలలో నల్లబెల్లి మండల PACS చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా రఘుపతిరావు మాట్లాడుతూ
భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే అన్నారు. గతంలో రేషన్ షాపుల్లో వేలిముద్రలు రాక, ఓటీపీలతో ఇబ్బందులు పడేవారని, అలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందన్నారు. పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు అందుతున్నాయని, రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్లబెల్లి PACS డైరెక్టర్లు చార్ల శివారెడ్డి, జిల్లా మునేందర్, బత్తిని మల్లయ్య, కొండాయిలపల్లె సర్పంచ్ ఎరుకలి స్వప్న నరేష్, బుచ్చిరెడ్డిపల్లె సర్పంచ్ భూక్య భద్రమ్మ బౌసింగ్, మండల ఆర్ ఐ కృష్ణస్వామి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దూరి తిరుపతిరావు, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గద్దల సురేష్, నల్లబెల్లి వార్డ్ మెంబర్ మాసంపెల్లి అఖిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు