తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని, ఇందుకోసం అవసరమైన కసరత్తు ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియెట్లో జరిగిన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అసైన్డ్ భూముల పరిరక్షణకు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించాలని, జిల్లాల్లో అసైన్డ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
రాష్ట్రాలు
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు: అధికారులకు సీఎం ఆదేశాలు
News URL: https://rightsmedia.in/news/ownership-rights-for-assigned-lands-cm-s-orders-to-officials