సికింద్రాబాద్అక్టోబర్ 8(రైట్స్ మీడియా): దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్ హెచ్ ఎం కింద పనిచేస్తున్న ఉద్యోగులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్రమబద్ధీకరించి, పర్మినెంట్ ఉద్యోగులుగా కొనసాగిస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ఇంతకాలంగా సేవలందిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ఇప్పటివరకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమని ఎంపి ఈటల రాజేందర్ అన్నారు.
హెల్త్ డిపార్ట్మెంట్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) కింద వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది ఉద్యోగులు గత 15 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. వీరిలో డాక్టర్లు, నర్సులు, టెక్నికల్ సిబ్బంది తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారని అన్నారు.
ఎన్ హెచ్ ఎం(NHM) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి: ఎంపీ ఈటల రాజేందర్
ఎన్ హెచ్ ఎం పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూరుస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉద్యోగుల విధివిధానాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలపై తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 15 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో కీలకమైన సేవలు అందిస్తున్న సుమారు 17 వేల మంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను డాక్టర్ల నుంచి టెక్నికల్ సిబ్బంది వరకు పర్మినెంట్ చేయాలన్న వారి డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని అన్నారు.
ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 13న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు NHM ఉద్యోగులు చేపట్టనున్న ధర్నాకు నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం NHM ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.