ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 109వ వార్షిక సదస్సుకు సంబంధించిన న్యూస్లెటర్ను బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి సమక్షంలో విడుదల చేసినట్లు ఆచార్య బి. సురేష్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్ ఆచార్య అనిల్ కుమార్ ఠాకూర్‌తో పాటు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.