టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమక్షంలో.. టీపీసీసీ సోషల్ మీడియా నూతన ఛైర్మన్ గా నవీన్ పెట్టెం గాంధీ భవన్ లో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌తో పాటు నూతనంగా నియమితులైన సోషల్ మీడియా కన్వీనర్లు, కోఆర్డినేటర్లు కూడా తమ తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా ఛైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ , రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి , వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నవీన్ పెట్టెం మాట్లాడుతూ.. "ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, క్షేత్రస్థాయి మరియు గ్రామస్థాయి సమస్యలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం, అలాగే 2029లో కాంగ్రెస్ పార్టీని 100 స్థానాలలో గెలిపించి, మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించడమే మా లక్ష్యం" అని పేర్కొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
తెలంగాణ
టీపీసీసీ సోషల్ మీడియా ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నవీన్ పెట్టెం
News URL: https://rightsmedia.in/news/naveen-pettem-takes-charge-as-tpcc-social-media-chairman