న్యూఢిల్లీ(రైట్స్ మీడియా): మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఆయనకు వివరించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జాతీయం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ..
News URL: https://rightsmedia.in/news/mp-etala-rajender-meets-union-home-minister-amit-shah
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, అలాగే పేదలు మరియు రైతుల భూములను '22A' నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ అంశాలపై అసెంబ్లీలో మరియు ప్రజాక్షేత్రంలో బీజేపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహిస్తున్న పోరాటాల సరళిని అమిత్ షాకు వివరించారు.
ఈ సందర్భంగా.. రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నిక పై కూడా చర్చించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో దిగ్విజయంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారనే శుభసందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలను కూడా వివరించారు.