లీకేజీల గుర్తింపునకు AI ఆధారిత విధానాలపై జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న సమీక్ష
జిడబ్ల్యూఎంసి(రైట్స్ మీడియా): నగరంలో నీటి పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి, నివారించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న సూచించారు.
గురువారం సాయంత్రం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో బాంబేకు చెందిన పిఆర్వో సంస్థ ప్రతినిధులు నీటి పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి అరికట్టే విధానాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డ్యాష్‌బోర్డ్ ద్వారా పైప్‌లైన్ తనిఖీ వీడియోలు, చిత్రాలను విశ్లేషించి లీకేజీలు, పైప్‌లైన్ పగుళ్లు, తుప్పు, అడ్డంకులను గుర్తించే విధానాన్ని వివరించారు.
అలాగే జీఐఎస్ మ్యాపింగ్ సహాయంతో లీకేజీలు ఉన్న ఖచ్చితమైన ప్రాంతాలను గుర్తించడం, మరమ్మతులను వేగవంతం చేయడం, నీటి వృథాను తగ్గించడం, పైప్‌లైన్ వైఫల్యాలను ముందుగానే అంచనా వేయడం వంటి అంశాలను ప్రజెంటేషన్‌లో వివరించారు.
ఈ విధానాన్ని పరిశీలించిన కమిషనర్, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో నీటి లీకేజీలను సమర్థవంతంగా గుర్తించి, నివారించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, సంజయ్‌కుమార్, అస్కి ప్రతినిధి రాజ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.