దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం హన్మకొండలోని డీసీసీ భవన్లో జిల్లా అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
వైఎస్సార్‌కు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళి
News URL: https://rightsmedia.in/news/mla-kr-nagaraju-pays-tribute-to-ysr
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో, బడి ఈడు పిల్లల నుండి పండు ముసలివారి వరకు సంక్షేమ సారధిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు ఆ దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి అని , వారి భౌతికంగా మనకు దూరం ఉన్నా, వారి పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటారని అన్నారు.అందరి హృదయాలు గెలిచిన మహానేత వైయస్సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు,మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,జిల్లా సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.