నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌత్ మండలంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ లకు మంజూరైన 1.25 కోట్లతో త్వరగా మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు.అలాగే మినీ ట్యాంక్ బండ్ నిర్వహణను నీటిపారుదల శాఖ నుంచి కార్పొరేషన్ కు అప్పగించాలన్నారు. అలాగే నార్త్ మండలానికి సంబంధించి డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రధానంగా ఈ నెల 25న ఇందూరులో నిర్వహించే గణపతి నిమజ్జన శోభాయాత్ర కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం నగరంలో పలు ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్ ల సమస్యపై కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. వీలైనంత తొందరగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, ఇరిగేషన్ శాఖ ఈఈ నరేందర్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.