కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు దుర్గపు సుజాత ఇటీవల మృతి చెందడంతో, తాడికల్ గ్రామంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దుర్గపు సుజాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం దుర్గపు సుజాత అందించిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. పార్టీ పట్ల వారికున్న అంకితభావం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.
ఆమె కుమారుడు, కుమార్తె చదువుల వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
రాష్ట్రాలు
దుర్గపు సుజాత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం
News URL: https://rightsmedia.in/news/minister-ponnam-consoles-durgapu-sujatha-s-family