అక్కన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
అక్కన్నపేట(రైట్స్ మీడియా): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. సర్పంచ్ సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, అక్కన్నపేట మండల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.