మదనపల్లెలోని ప్రసిద్ధ బసినికొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం వేకువజామున భారీ చోరీ జరిగింది. హెల్మెట్లు ధరించి వచ్చిన దొంగలు ఆలయ ఇనుప తలుపులు ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. హుండీ పగలగొట్టి అందులోని నగదుతో పాటు అమ్మవారి బంగారు ఆభరణాలను అపహరించి, హెల్మెట్ అక్కడే పడేసి పరారయ్యారు. ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
బసినికొండ గంగమ్మ ఆలయంలో భారీ చోరీ.. హెల్మెట్లు ధరించి వచ్చిన దొంగలు
News URL: https://rightsmedia.in/news/major-theft-at-basinikonda-gangamma-temple-thieves-arrived-wearing-helmets