⏩గాంధీజీ అనుసరించిన శాంతియుత మార్గంలోనే సమాజాభివృద్ధి సాధ్యం: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
⏩మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
హనుమకొండ (రైట్స్ మీడియా): గాంధీ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం, ఆశయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, తదితరులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ...
మహాత్మా గాంధీ 157వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. గాంధీజీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి వంటి మహనీయులు దేశం కోసం చేసిన సేవలు, త్యాగాలను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.
శాంతియుతంగా ఏదైనా సాధించగలమని ఆచరించిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని పేర్కొన్నారు. గాంధీజీ త్యాగాలు, అందించిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలు, త్యాగాలను భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. దేశ ప్రధానిగా లాల్ బహుదూర్ శాస్త్రి అందించిన సేవలు ఎంతో గొప్పవని తెలిపారు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ...
మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి యుగ పురుషులని, వారి గొప్పతనం, సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. దేశాన్ని శాంతియుత మార్గంలో స్వరాజ్య సాధనకు కృషి చేసిన మహనీయులు గాంధీజీ అని పేర్కొన్నారు. గాంధీజీ అనుసరించిన మార్గాన్ని, ఆశయాలు, త్యాగాలను ప్రపంచ దేశాలు గుర్తు చేసుకుంటున్నాయని తెలిపారు.
గాంధీజీ అనుసరించిన శాంతియుత మార్గం ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ మండేలా వంటి నేతలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి లాల్‌బహదూర్ గొప్ప విజ్ఞానవంతులు, మేధావి అని అన్నారు. 1965 భారత్–పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఆయన ఇచ్చిన జై జవాన్.. జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఐక్యంగా ఉంచారని అన్నారు. ప్రధానిగా లాల్ బహుదూర్ శాస్త్రి దేశానికి విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్, కుడా మాజీ ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.