ప్రభుత్వ బాలిక సదనం లో రక్షణ సంరక్షణ విద్యా బుద్ధులు నేర్చుకొని తన ఇష్టాలకు అనుగుణంగా దత్తతకు ఒప్పుకొని కేంద్ర దత్తత ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం రోజున తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా ఉదయాల్పురం కు చెందిన దంపతులకు కలెక్టర్ ఛాంబర్ లో చట్టబద్ధమైన దత్తత అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని అన్నారు.కాగా దత్తత ఇవ్వబడిన బాలికతో కలెక్టర్ మాట్లాడి హర్షం వ్యక్తం చేసారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి
ఎం విశ్వజ, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సిహెచ్ అవంతి, ప్రభుత్వ బాలికల సదనం సూపరింటెండెంట్ ఎం కల్యాణి, ఈవో ఆశాదేవి, ఇంచార్జి డిసిపివో ఎస్ ప్రవీణ్ కుమార్, సోషల్ వర్కర్ సంగి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
ప్రభుత్వ బాలిక సదనం నుంచి తమిళనాడుకు దత్తత.
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్.
News URL: https://rightsmedia.in/news/legal-adoption-is-good-hanumakonda-district-collector-chahat-baj-pai