హసన్పర్తి(రైట్స్ మీడియా): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని కరీంనగర్-హనుమకొండ ప్రధాన రహదారి పక్కన దేవాదుల ప్రాజెక్టు పైప్లైన్ లీక్ కావడంతో భారీగా నీరు వృధా అవుతోంది. నీటి ఒత్తిడి (ప్రెషర్) కారణంగా ఈ ప్రాంతంలో నీరు ఫౌంటెన్ లాగా పదుల అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతోంది.
ప్రధాన రహదారి పక్కనే ఈ ఘటన జరగడంతో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. భారీ స్థాయిలో నీరు వృధాగా పోతుండటంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పైప్లైన్కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.