15 వ అల్ ఇండియా యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (AIUEC) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న “హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా” జాతీయ సదస్సులో కాకతీయ విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ నాన్-గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (NGOs) అధ్యక్షులు బూర నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మహమ్మద్ యూనస్, ప్రధాన కార్యదర్శి వల్లాల తిరుపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏతిరాజుల సతీష్ బాబు, రిక్రియేషన్ కార్యదర్శి తోట ప్రభాకర్, కోశాధికారి తాటి దామోదర్, మహిళా ప్రతినిధి భూపతి కృష్ణవేణి పాల్గొన్నారు. అలాగే క్లాస్-ఫోర్త్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు పోతారుబోయిన అంకుస్, ప్రధాన కార్యదర్శి బొక్క మొగిలితో పాటు నాయకులు తిర్మల్ సింగ్, వాలిపాషా, ఐలయ్య, మల్లికాంబ తదితరులు జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఉన్నత విద్యారంగ అభివృద్ధి, ఉద్యోగుల సమస్యలు, విశ్వవిద్యాలయాల పరిపాలన, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై సదస్సులో చర్చలు జరుగుతున్నాయి.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
తెలంగాణ
జాతీయ సదస్సులో కేయూ ఉద్యోగ సంఘాల నేతలు
News URL: https://rightsmedia.in/news/ku-union-leaders-at-national-conference