హైదరాబాద్ (రైట్స్ మీడియా): రాష్ట్ర సచివాలయంలోని 4వ అంతస్తులో ఉన్న సాగునీటి పారుదల, ఆహార మరియు నిత్యవసర సరుకుల సరఫరా శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాస (R&R) పరిహారం, మరియు అటవీ శాఖ క్లియరెన్స్ (Forest Clearance) సమస్యలపై సమగ్రంగా చర్చించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
రాష్ట్రాలు
సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై కీలక సమీక్షా సమావేశం
⏩సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
News URL: https://rightsmedia.in/news/key-review-meeting-on-irrigation-projects-at-the-secretariat
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల వేగం, ప్రస్తుత స్థితిగతులపై ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమీక్షించారు.
ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా మిగిలివున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా కోరడం జరిగింది.
ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లతో పాటు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు మరియు శాఖాపరమైన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.