ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని నల్లబెల్లి తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. తహశీల్దార్ ముప్పు కృష్ణ కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కోసం కాళోజి నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రజల సమస్యలపై తన కలం ద్వారా నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తిగా కాళోజి నిలిచారన్నారు.
ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్లు మాడ సంపత్, ఎం. కృష్ణస్వామితో పాటు తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
కాళోజి సేవలు చిరస్మరణీయం: తహశీల్దార్ ముప్పు కృష్ణ
News URL: https://rightsmedia.in/news/kaloji-s-services-are-unforgettable-tahsildar-muppu-krishna