మహాబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో డెలివరీ కంపెనీలో పనిచేయుటకు అర్హత కలిగిన పురుష అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తేదీ: 11.09.2026 న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
కంపెనీలో ఉన్న 25 ఖాళీలకు గాను అభ్యర్థులు 18 - 35 సంవత్సరాలు కలిగి ఎస్.ఎస్.సి (SSC) పూర్తి చేసి బైక్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండవలెనని అన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు తేది.11.09.2026 న ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్‌తో జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం, రూమ్ నెంబర్ 25, రెండవ అంతస్తు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్), కురవి రోడ్, మహబూబాబాద్ నందు నేరుగా హాజరుకావలెనని అధికారి ఈ సందర్బంగా పేర్కొన్నారు.