నిజామాబాద్(రైట్స్ మీడియా): జిల్లా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈర్ల రాజ్ గణేష్ ను పార్టీ అధిష్టానం ఎంపిక చేశారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా కట్టుబడి పని చేయడం, ప్రజా సమస్యలపై పోరాడడం, పార్టీలో చురుకుగా పాల్గొనడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈర్ల రాజ్ గణేష్...
⏩ఎంపి, ఎంఎల్ఏ, జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపిన రాజ్ గణేష్...
News URL: https://rightsmedia.in/news/irla-raj-ganesh-as-bjym-district-vice-president
ఈ సందర్భంగా ఈర్ల రాజ్ గణేష్ మాట్లాడుతూ..
నాపై నమ్మకంతో నాకు బీజేవైఎం ఇందూర్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డికి, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ కి, "ప్రత్యేక ధన్యవాదాలు" తెలియజేశారు. నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు పార్టీ బలోపేతం మరియు ప్రజా విద్యార్థి కార్మిక సమస్యలపై పార్టీ సూచనల మేరకు అందరిని కలుపుకొని పోరాడుతానని స్పష్టం చేశారు.