గ్లోబల్ సౌత్‌లోని భాగస్వాములతో ఆరోగ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు, భారత్ 10 టన్నుల యాంటీ-రెట్రోవైరల్ మందుల సరుకును బోట్స్వానకు పంపింది.
బోట్స్వానకు యాంటీ-రెట్రోవైరల్ మందులను పంపిన భారత్
భారత్ తన గ్లోబల్ సౌత్ భాగస్వాములతో ఆరోగ్య సహకారాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు వేస్తూ, సెప్టెంబర్ 15న 10 టన్నుల యాంటీ-రెట్రోవైరల్ మందుల సరుకును బోట్స్వాన కు పంపింది. ఈ మందులను హెచ్ఐవి/ఎయిడ్స్ చికిత్సకు ఉపయోగించనున్నారు.
"హెచ్ఐవి/ఎయిడ్స్ చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా, ఈ రోజు 10 టన్నుల యాంటీ-రెట్రోవైరల్ మందులను పంపాము. ఇది గ్లోబల్ సౌత్‌లోని భాగస్వాములతో ఆరోగ్య సహకారాన్ని బలోపేతం చేయాలనే మా నిబద్ధతను ప్రదర్శిస్తుంది." భారతదేశం ఎల్లప్పుడూ గ్లోబల్ సౌత్‌లోని భాగస్వాములతో ఆరోగ్య, మానవతా సహకారానికి ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. బోట్స్వానాకు పంపిన సహాయం ఈ కొనసాగుతున్న నిబద్ధతలో భాగమే అని 'ఎక్స్' అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ అన్నారు.