మల్బరీ సాగుతో ఎకరానికి రూ. 2 లక్షల ఆదాయం
కేంద్ర సిల్క్ బోర్డు 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మల్బరీ సాగు విస్తీర్ణం ను పెంచే క్రమంలో నా పట్టు – నా అభిమానం 2.0 (MERA RESHAM – MERA ABHIMAN 2.0) కార్యక్రమానికి కేంద్ర సిల్క్ బోర్డు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ శాస్త్రవేత్త జె. శ్రీకాంత్ నాయక్, సహాయ పట్టు పరిశ్రమ అధికారి కె సురేష్ మల్బరీ సాగు మరియు పట్టు పురుగుల పెంపకము గురించి రైతులకు పలు సాంకేతిక సలహాలు ఇస్తూ పలు సందేహాలు నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైతాంగం పంట మార్పిడి ద్వారా మార్కెట్ డిమాండ్ ఉన్న మల్బరీ సాగు చేపట్టి ఎకరానికి రూ. 2 లక్షల ఆదాయం పొందాలని తెలిపారు. ఈ పంట ఆదాయం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం తో సమానం అని తెలిపారు. క్లస్టర్ స్థాయిలో సామూహికంగా మల్బరీ సాగు చేపట్టాలని దీనికి కోతులు, దొంగల బెడద లేదని, ఒక సంవత్సరం లో 5 నుఁడి 6 పంటలు తీసుకోవచ్చని ఎక్కువ స్థాయిలో ఎరువులు అవసరం లేదని, పురుగు మందులు అసలు అవసరం లేదని తెలుపుతు ఈ సాగు వైపు మొగ్గుచూపాలని తెలిపారు. వరి, మొక్కజొన్న, ప్రత్తి, మిరప సాగు విస్తీర్ణం తగ్గించి ఈ మల్బరీ పంటని సాగు చేసి ఆర్ధికంగా ఎదగాలని తెలిపారు..
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.